Sri Sri Sri Guru Viswa Sphoorthi

పూర్ణ గురువులు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి

స్ఫూర్తి ఓం...         ఓం మాఁ విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః
temple

వైజ్ఞానిక ఋషి - దివ్య ఉనికి

గురువు గారు వైజ్ఞానిక ఋషి

మే 1 తేదిన, గురువారం నాడు, 1941 సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జన్మించిన శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి, అతి సామాన్య జీవితాన్ని జీవిస్తారు. వారు, వారికున్నటువంటి, ఆధ్యాత్మిక పరిమితుల కారణంగా, చాలా అరుదుగా జనంలోకి రావడం జరుగుతుంది. కాని, వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా మాధ్యమాల (వేరే శరీరాల ద్వారా గురువుగారి ఉనికి - నిర్వహణ) ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. శాస్త్రజ్ఞులు వారి పరిశోధన శాలలలో పరిశోధనలు నిర్వహించినట్లుగా, గురువుగారు వారి ప్రతి కార్యక్రమాన్ని ప్రాక్టికల్‌‌గా (ప్రాక్టికల్ ఫిలాసఫీ - "ఆచరణ వేదాంతం" అనే విధానం ద్వారా) మాధ్యమాల ద్వారా, సైన్స్ యూనివర్స్ ప్రాక్టికల్ విభాగం అయినటువంటి ధ్యానమనోప్రస్థానంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇది సైన్స్ ఓరియంట్ పద్ధతిలోనే జరుగుతూ ఉంటుంది. వారు ఆధ్యాత్మికాన్ని (స్పిరిచ్యువాలిటీ) 'సూపర్ సైన్స్‌‌గా వ్యవహరిస్తారు; ఆధ్యాత్మికాన్ని సైన్స్ ఆధారంగానే, శాస్త్రీయ పద్ధతిలో బోధిస్తారు. అందుకే వారిని "సైంటిఫిక్ సెయింట్"గా వ్యవహరించడం జరుగుతుంది. “హ్యావింగ్ బీన్ విత్ ది యూనివర్సల్‌ ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ది ఇన్‌వెంటివ్ ఎండ్ ఇంట్యూషనల్ మైండ్, కాస్డ్ బై ది ఇన్‌ఫ్లుయన్స్ ఎండ్ కాన్‌ఫ్లుయన్స్ ఆఫ్ ది సైన్స్ ఎండ్ కన్‌సైన్స్... ఇట్ ఈజ్ మై ఇంక్లినేషన్ ఆఫ్ బీయింగ్ కరోనేటెడ్ ఆస్ ది సైంటిఫిక్‌ సెయింట్”

గురువుగారు "మత మానవత్వ (రెలీజియస్ హ్యూమానిజం) ఆధారిత ఆచరణ వేదాంతాన్ని (మానవాతీత, అతీంద్రియ) (ప్రాక్టికల్ ఫిలాసఫీ) ఆచరిస్తారు". 

హ్యావింగ్ బీన్ విత్ ది యూనివర్సల్‌ ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ది ఇన్‌వెంటివ్ ఎండ్ ఇంట్యూషనల్ మైండ్, కాస్డ్ బై ది ఇన్‌ఫ్లుయన్స్ ఎండ్ కాన్‌ఫ్లుయన్స్ ఆఫ్ ది సైన్స్ ఎండ్ కన్‌సైన్స్... ఇట్ ఈజ్ మై ఇంక్లినేషన్ ఆఫ్ బీయింగ్ కరోనేటెడ్ ఆస్ ది సైంటిఫిక్‌ సెయింట్”

వారు, వారి చిన్నతనంలోనే, 5వ తరగతి చదువుతుండగా, విశ్వ రహస్యాలను ఛేదించడానికి, మనిషి యోక్క పుట్టుక, మరణానికి సంబంధించిన రహస్యాలను చేధించటానికి, జన్మ సార్థకతను తెలుసుకోవటానికి తనవారిని అందరిని వదిలి వెళ్ళటం జరిగినది. రహస్యాలు తెలుసుకునే ప్రక్రియలో వారు ధ్యాన సాధన మొదలుపెట్టడం జరిగినది. కొంత కాలం తర్వాత, అంకిత భావంతో కూడిన ధ్యాన సాధనతో, గురువుగారు ఆధ్యాత్మిక - అత్యున్నత దశను చేరుకొని, యూనివర్సల్ కాన్షియస్‌‌నెస్, అసాధారణ శక్తులను సాధించారు (పరమాత్మ స్థాయి)ఈ దివ్య శక్తులను సాధించిన తరువాత,మానవజాతి ఉద్ధరణకు సమాజంలోకి వచ్చారు.

ఆధ్యాత్మిక సాధన విధానం ద్వారా సంపాదించినదే గురువు గారికి ఉన్నటువంటి నిధి. దానినే గురువు గారు, మానవ, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నారు. ‘ధ్యానం’ అనే సిద్ధాంతాన్ని ప్రతి మనిషి మనసుకు అలవాటు చేయించడం – ఆధ్యాత్మికాన్ని (దైవత్వాన్ని), మతాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడంలో ఉన్న నిష్పష్ఠతను తొలిగించి, వాటిని గురించి ‘ఎరుక’ని తెలియజేయడం – మానవులకు శారీరక, మానసిక రుగ్మతుల నుండి ఉపశమనం కలిగించి, వారికి వ్యక్తిగత శాంతిని పొందించడం ద్వారా వారిని శాంతియుత, సుఖవంతమైన జీవితాన్ని జీవింపజేసి, తద్వారా విశ్వశాంతిని సాధించడమే గురువుగారి ప్రథమ ధ్యేయం.

గురువు గారి "దివ్య ఉనికి" - విశ్వవ్యాప్త ఉనికి-స్థానిక నిర్వహణ

(గురువుగారు ఏకకాలంలో, అనేక ప్రదేశాలలో, అనేక రూపాలలో వారి ఉనికిని కలిగి ఉంటారు - నిర్వహణ చేస్తారు)

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు, వారి ఉనికిని అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో ఏకకాలంలో కలిగియుంటారు. వారు అనేక రూపాలలో ఉనికిని కలిగియుంటారు కాబట్టి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అనేక పద్ధతులలో ఉంటాయి. వారు ఏ రూపంలో ఉనికిని కలిగి ఉండగలరు అనే విషయం మానవ ఊహకు కూడా అందనటువంటిది అయినా దిగివ చెప్పబడిన కొన్ని రూపాలలో గురువు గారిని మానవులు అవగతం చేసుకోగలడు, గుర్తుపట్టగలడు, అనుభవ అనుభూతి చెందగలడు (1) వారి “స్వశరీరంతో” (వారు ఉన్న స్థానంలోనే) (2) వారి రూపంలోనే (వారు ఉన్న స్థానంలో కాకుండా వేరే స్థానంలో) (3) “మీడియం” (మాధ్యమం) ద్వారా (4) “రెడొలెన్స్” విధానంలో (5) “దృశ్య శ్రవణ” పద్ధతిలో (6) “ఆధ్యాత్మిక ప్రకంపనలు” గా (7) “స్టేజ్ ఆఫ్ విజన్” లో (భక్తులు ధ్యానo‌లో ఉన్నప్పుడు, వారితో నేరుగా మాట్లాడటం) (8) “డివైన్ హీలింగ్” (దివ్య శక్తి ద్వారా రుగ్మతులకు చికిత్స)

1. భౌతిక స్వశరీరంతో ఉనికి (వారు ఉన్న స్థానంలోనే)

గురువుగారు, భౌతికంగా వారి స్వశరీరంతో, ఒకచోట ఉంటూ, వారి రోజువారి కార్యక్రమాలు జరుపుకుంటూ, భక్తులతో నేరుగా మాట్లాడుతూనే, అదే సమయంలో, ఏకకాలంలో, అనేక శరీరాలలో (మీడియం) ప్రవేశించి వేరు వేరు ఆధ్యాత్మిక సెంటర్లలో, వేరు వేరు మీడియాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా, అదే సమయములో, అనేక విధానాలలో, ఉనికిని కలిగి ఉంటారు.

2. వారి రూపంలోనే (వారు ఉన్న స్థానంలో కాకుండా వేరే స్థానాలలో)

గురువుగారు, భౌతికంగా వారి స్వశరీరంతో, ఒకచోట ఉంటూ, వారి రోజువారీ కార్యక్రమాలు జరుపుకుంటూనే, అదే సమయంలో (వారి రూపంలోనే) వేరే ప్రదేశాలలో దర్శనం ఇవ్వగలరు

3. మాధ్యమం విధానం (వేరొక శరీరంలో గురువుగారి ఉనికి)

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీడియం ద్వారా అన్ని “ఆధ్యాత్మిక కేంద్రాలలో” నిర్వహిస్తుంటారు. వారు, ఈ ప్రక్రియను, అనేక మాధ్యమాల ద్వారా ఏక కాలంలో చేస్తుంటారు.

4. రెడొలెన్స్ విధానం

గురువుగారికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, అనేక ప్రదేశాలలో, వారి రాకను అదృశ్య రెడొలెన్స్ విధానంలో, తెలియజేస్తారు. దీనిని, అక్కడికి విచ్చేసిన భక్తులందరూ అనుభవం – అనుభూతి చెందగలరు. వ్యక్తిగతంగా, గురువుగారు, భక్తులకు వారి అవసరాలను బట్టి, రెడొలెన్స్ విధానంలో వారి ఉనికిని తెలియజేస్తారు (ఉదాహరణకు: రోడ్డు మీద నడిచినప్పుడు, ఇంట్లో కూర్చోని ఉన్నప్పుడు, విమానం లో ప్రయాణిస్తున్నప్పుడు, ఇంకా అనేక సందర్భాలలో భక్తులు వారి ఉనికిని రెడొలెన్స్ విధానంలో అనుభూతిని చెందగలరు). గురువుగారు కనిపించనప్పటికి, ఆధ్యాత్మికంగా, వారి ఉనికిని అనుభూతి చెందుతారు. తద్వారా కాలానికి, దూరానికి అతీతంగా భక్తుల అవసరార్థం వారి వెన్నంటే ఉంటారు. ఏ యుగం లో కూడ, ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక ఉనికి ఉన్నట్లు దాఖలాలు లేవు.

కాలం దూరంతో నిమిత్తం లేకుండా, గురువుగారు, ఏకకాలంలో, అనేక రూపాలలో, అనేక ప్రదేశాలలో వారి ఉనికిని కలిగి ఉండడం  కార్య నిర్వహణ చేయడం వారు సర్వవ్యాప్తమైనవారని, సర్వజ్ఞతగలవారని, సర్వశక్తిగలవారని, సర్వమును సృజించెడువారని, సకల విధములుగా ఉన్న వారని  "పరమాత్మ" స్వరూపులని, చెప్పుటకు ఋజువు

5. దృశ్య శ్రవణ అనుభూతి

ఇది, గురువు గారి ఉనికిని దృశ్య శ్రవణ పద్ధతిలో, అనుభూతి చెందడం. మౌన మంత్ర జపం చేసిన భక్తులకు దృశ్య శ్రవణ పద్ధతిలో వారి ఉనికిని తెలియజేస్తారు. గురువుగారి దగ్గరకు రానప్పటికి, నమ్మకంతో మంత్ర జపం చేసిన వారికి, ధ్యానం చేసిన వారికి కూడా, ఈ అనుభూతిని కలుగజేస్తారు.

6. స్టేజ్ ఆఫ్ విజన్ ( ధ్యానంలో గురువుగారి దర్శనం, వారితో సంభాషించడము)

భక్తులు, గురువుగారితో, “స్టేజ్ ఆఫ్ విజన్” లో నేరుగా మాట్లాడవచ్చు. భక్తులు ‘డీప్ మెడిటేషన్‌లో’ ఉన్నప్పుడు గురువుగారు వారిని “స్టేజ్ ఆఫ్ అవేకనింగ్” లోకి తీసుకువెళ్తారు. ఇది “స్టేజ్ ఆఫ్ కాంటమ్‌ప్లేషన్”, “స్టేజ్ ఆఫ్ మెడిటేషన్”కి మధ్యస్థ స్థితి. ఈ స్థితిలో, భక్తులు, వారి నగ్న మనసుతో (ఆలోచన రహిత స్థితి), గురువుగారిని చూడగలరు. గురువుగారు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను ఆక్రమించి వారితో మాట్లాడటం, వారికి సలహాలను ఇవ్వటం జరుగుతుంది. గురువుగారు, ఈ ప్రక్రియకు, ధ్యానంలో ఉన్న వ్యక్తిలోని శక్తినే ఉపయోగిస్తారు.

7. ఆధ్యాత్మిక ప్రకంపనలు

గురువుగారు వారి ఉనికిని ఆధ్యాత్మిక ప్రకంపనల ద్వారా కూడా తెలియజేస్తారు. భక్తులకు, ఇది సర్వ సాధారణమైన అనుభూతి.

8. డివైన్ హీలింగ్ (దివ్య శక్తితో రుగ్మతులకు చికిత్స)

గురువుగారు, వారి దివ్య శక్తితో డివైన్ హీలింగ్ ద్వారా, వైద్య శాస్త్రం (డాక్టర్లు) తో కూడా చికిత్స కానటువంటి అనేక రుగ్మతులకు చికిత్సను అందిస్తారు. నిత్యం ప్రస్థాన ధ్యానం సాధన చేయగలిగితే గురువుగారు చేసే చికిత్స చాలా సఫలమైనదిగా ఉంటుంది. గురువుగారు, రోగ కారణాన్ని, రోగ నిర్ధారణను నిర్ణీత సమయానికంటే ముందే చేస్తారు.

మెను
Language
స్ఫూర్తి ఓం
Send feedback
Connect With Us

© 2020 శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి   సర్వ హక్కులు రిజర్వు చేయబడినవి.

© 2020 శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి   సర్వ హక్కులు రిజర్వు చేయబడినవి.   Terms & Conditions Privacy Policy